టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి అనిల్ ఫోన్..ఎందుకంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో కూడా నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ స‌మయంలో ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్..ఓ టీడీపీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ప‌లు విష‌యాలు చ‌ర్చించారు. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రు..వారు చ‌ర్చించిన అంశాలు ఏంటి..ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఏలూరి […]

టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి అనిల్ ఫోన్..ఎందుకంటే..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 1:07 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో కూడా నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఈ స‌మయంలో ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్..ఓ టీడీపీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ప‌లు విష‌యాలు చ‌ర్చించారు. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రు..వారు చ‌ర్చించిన అంశాలు ఏంటి..ఈ స్టోరీలో చూద్దాం.

టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావులు రాసిన లేఖకు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తీర్చేందుకు చెరువులను సాగర్ నీటితో నింపాలని, ఎండాకాలంలో ప్ర‌జ‌ల‌కు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యేలు లేఖ‌లో కోరారు. దీనిపై మంత్రి అనీల్​ కుమార్​ యాదవ్​ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​కు ఫోన్ చేసి మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదివరకే ఈ అంశాన్ని తనతో చ‌ర్చించార‌ని, పరిశీలనలో ఉందని తెలిపారు. కలెక్టర్​తో మాట్లాడి పూర్తి స‌మాచారాన్ని తెలుసుకుని చ‌ర్య‌లు తీసుకుంటామని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చెప్పారు.

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!