Breaking News
  • హైదరాబాద్: పోలీసులకు 9 క్వింటాళ్ల బియ్యాన్ని ఉచితంగా అందించిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌, కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌.
  • కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. వలస కార్మికులకు కనీస వేతనం చెల్లించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌. పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు. వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజనం. మధ్యాహ్నం 40 వేల మందికి, రాత్రి పూట 15 వేల మందికి భోజనం. నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమంటున్న జీహెచ్‌ఎంసీ. ఆరేళ్ల క్రితం 8 కేంద్రాలతో ప్రారంభం, నేడు 150 కేంద్రాలకు విస్తరణ.
  • గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి చేయడం సిగ్గుచేటు. డాక్టర్లపై దాడిని ఒవైసీ ఎందుకు ఖండించలేదు. ప్రభుత్వానికి, డాక్టర్లకు సహకరించాలని ఒవైసీ ఎందుకు చెప్పడంలేదు. డాక్టర్లపై దాడి చేస్తే రోగులను అడవుల్లో వదిలిపెట్టాలి -ఎమ్మెల్యే రాజాసింగ్‌.
  • విశాఖలో కరోనా వైరాలజీ ల్యాబ్‌. కేజీహెచ్‌లో ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు. కాసేపట్లో ప్రారంభించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌.

వెలుగులోకి పంచనామా పూర్తి ప్రతి.. భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం

AP IT Raids Panchnama Released, వెలుగులోకి పంచనామా పూర్తి ప్రతి.. భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ లో పంచానామాల పోరాటం తీవ్రమైంది. వారం రోజుల క్రితం జరిగిన ఐటి దాడులకు సంబంధించి అధికార, విపక్షాలు పోటాపోటీగా పంచానామాల కాపీలను మీడియాకు సర్క్యులేట్ చేసి రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. గత వారం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలపై జరిగిన  దాడుల్లో 2 వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి, అక్రమార్జన వివరాలు బయటపడినట్లు తొలుత కథనాలు వచ్చాయి.

ఐటి దాడులపై వచ్చిన కథనాల ఆధారంగా అధికార వైసీపీ విపక్ష టిడిపి నేతలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. చంద్రబాబు జమానా ఏ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనడానికి అయన మాజీ పిఎస్ శ్రీనివాసరావు ఇంట్లో వెలుగు చుసిన అక్రమార్జన వివరాలు సాక్షాలతో వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

వైసీపీ నేతల ఆరోపణలను తిప్పేకొట్టేందుకు టీడీపీ నేతలు ఐటి దాడుల పంచానామాకు సంబంధించి కొన్ని ప్రతులని మీడియాకు విడుదల చేశారు. వాటిలోని వివరాల ఆధారంగా వైసీపీ నేతల ఆరోపణలు పూర్తిగా నిరాధారాలని చెప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ఈ దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల వివరాలు వెలుగు చూడలేదని, కేవలం రెండున్నర లక్షల రూపాయలను, 12 తులాల బంగారం గుర్తించి, వాటిపై వివరణ తీసుకుని వదిలేసారని టీడీపీ నేతలు యనమల, వర్ల రామయ్య తదితరులు చెప్పుకొచ్చారు. ఎలాంటి డైరీలను, లాకర్లను సీజ్ చేయలేదని.. ఒకవేళ చేసి ఉంటే పంచనామాలో ప్రస్తావించేవారని టీడీపీ నేతలు వాదించారు.

ఈ నేపథ్యంలో పంచనామా పూర్తి ప్రతులు మీడియాకు లీకయ్యాయి. వాటి ఆధారంగా చూస్తే ఐటి దాడుల్లో ఏమీ సీజ్ చేయలేదన్న టీడీపీ నేతల వాదనలో పస లేదని తేలిపోయింది. భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖా అధికారులు పేర్కొన్నారు. వాటితో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు. ఏబీ సుబ్బారెడ్డి లాకర్లు సీజ్ చేసినట్టు పంచనామాలో వెల్లడించారు. చంద్రబాబు మాజీ పిఎస్ కు పంచనామా కాపీ అందజేశారు.

 

Related Tags