స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని, దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆర్డర్ అవసరంలేదని స్పష్టంచేసింది. అయితే, తమను ఎన్నికల సంఘం సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతీదానికి రాజ్యాంగ సంస్థ వచ్చి అడగాలా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ విషయాల్లో సహకరించడంలేదో రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు […]

  • Venkata Narayana
  • Publish Date - 3:33 pm, Wed, 21 October 20

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని, దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆర్డర్ అవసరంలేదని స్పష్టంచేసింది. అయితే, తమను ఎన్నికల సంఘం సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతీదానికి రాజ్యాంగ సంస్థ వచ్చి అడగాలా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ విషయాల్లో సహకరించడంలేదో రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడంలేదని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని నిమ్మగడ్డ హైకోర్టును ఈ సందర్భంలో కోరారు.