గ్రామ ‘సచివాలయ’ మెరిట్ జాబితా… ఎప్పుడంటే?

AP Grama Sachivalayam Merit List 2019 Likely to release on 18 September, గ్రామ ‘సచివాలయ’ మెరిట్ జాబితా… ఎప్పుడంటే?

ఏపీలో గ్రామ సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా.. 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబరు 18న విడుదల చేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 9న నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ పరీక్షలకు సంబధించిన అభ్యర్థులు OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ త్వరలోనే ముగియనుందని.. ఇప్పటికే 21 లక్షల షీట్లను స్కానింగ్ చేసినట్లు వారు వెల్లడించారు. సెప్టెంబరు 18న మెరిట్ జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని.. పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కుతాయని అధికారులు తెలిపారు. నియామకాలు పూర్తయిన తర్వాత మిగిలిన పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *