వర్మకు జగన్ ప్రభుత్వం ఊహించని షాక్.. ఏం చేసిందంటే..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రానికి వివాదాలు ఆగేలా లేవు. ఈ సినిమాను ఈ రోజు విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఇంకా సెన్సార్ అవ్వలేదు. మరోవైపు ఈ మూవీ విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. వారంలో ఈ చిత్రాన్ని చూసి, నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును తెలిపింది. దాంతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న టైటిల్‌ను మార్చాల్సిందేనంటూ ఆదేశించింది. అలాగే ఈ మూవీ విషయంలో […]

వర్మకు జగన్ ప్రభుత్వం ఊహించని షాక్.. ఏం చేసిందంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2019 | 11:48 AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రానికి వివాదాలు ఆగేలా లేవు. ఈ సినిమాను ఈ రోజు విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఇంకా సెన్సార్ అవ్వలేదు. మరోవైపు ఈ మూవీ విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. వారంలో ఈ చిత్రాన్ని చూసి, నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును తెలిపింది. దాంతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న టైటిల్‌ను మార్చాల్సిందేనంటూ ఆదేశించింది. అలాగే ఈ మూవీ విషయంలో అందరి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

ఇదంతా పక్కనపెడితే తాజాగా వర్మకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా పేరును మార్చాలని జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ సెన్సార్ బోర్డు అధికారులు లేఖ రాశాడు. ఈ సినిమా టైటిల్ రెండు కులాల పేర్లను ప్రస్తావిస్తోందని.. దీని వల్ల ప్రజల్లో అలజడి వచ్చే ఆస్కారం ఉందని.. అందుకే టైటిల్‌ను మార్చాలంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా హైకోర్టు సూచనతో తన సినిమా పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మారుస్తానంటూ ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.