క‌రోనా క‌ష్ట‌కాలంలో ఏపీకి ఊర‌ట‌..ప్లాస్మాథెరపీ

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ఏపీ అల్లాడిపోతోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ అర్ధ‌సెంచ‌రీకి పైగానే న‌మోదుకావ‌టం ఆందోళ‌న ఆందోళ‌న రేపుతోంది. వైరస్‌ నియంత్రణ విషయంలో

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఏపీకి ఊర‌ట‌..ప్లాస్మాథెరపీ
Follow us

|

Updated on: Apr 27, 2020 | 1:50 PM

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ఏపీ అల్లాడిపోతోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ అర్ధ‌సెంచ‌రీకి పైగానే న‌మోదుకావ‌టం ఆందోళ‌న ఆందోళ‌న రేపుతోంది. వైరస్‌ నియంత్రణ విషయంలో ఏపీ సర్కార్ కూడా అంతే వేగంగా ముమ్మ‌ర చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులో భాగంగా… తాజాగా కేంద్రం నుంచి ఫ్లాస్మా థెరపీకి అనుమతిని సంపాదించింది. ఇక క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌జ‌లకు ప్లాస్మాథెర‌ఫీతో చికిత్స అందించ‌నున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో కార్యనిర్వాహక కమిటీని, ఆరుగురు వైద్యులతో సాంకేతిక కమిటీ బృం​దాన్ని నియమించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా ల్యాబొరేటరీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఇక‌, కరోనా రోగులకు చేస్తున్న ప్లాస్మా థెరపీ చికిత్స సత్ఫలితాల‌నిస్తోంది. కోవిడ్‌ బారినపడి ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి చేసిన ప్లాస్మా థెరపీ చికిత్స విజయవంతమైంది. పూర్తిగా కోలుకున్న ఆ 49 ఏళ్ల వ్యక్తి నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు ప్లాస్మా చికిత్స తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. కరోనా బారిన పడిన ఆ బాధితుడు ఈ నెల 4న ఢిల్లీలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈ నెల 8న వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ప్లాస్మా థెరపీతో చికిత్స అందించారు. నాలుగు రోజుల తర్వాత వెంటిలేటర్ తొలగించారు. ఈ నెల 18 వరకు  సప్లిమెంటరీ ఆక్సిజన్ అందిస్తూ వచ్చిన వైద్యులు.. అతడు పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు.