జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏకంగా ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌పై వేటు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అవినీతి, పనుల అలసత్యం విషయంలో అస్సలు కనికరించడం లేదు. తప్పు చేసిన వారిపై వేటు వేస్తూ.. బ్లైండ్‌గా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. తాజాగా ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌పై వేటు వేసింది ఏపీ సర్కార్. ఐఆర్‌ఎస్ ర్యాంక్ ఉన్న జాస్తి కృష్ణ కిశోర్..టీడీపీ సర్కార్ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా  పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వం […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:01 am, Fri, 13 December 19
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏకంగా ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌పై వేటు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అవినీతి, పనుల అలసత్యం విషయంలో అస్సలు కనికరించడం లేదు. తప్పు చేసిన వారిపై వేటు వేస్తూ.. బ్లైండ్‌గా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. తాజాగా ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌పై వేటు వేసింది ఏపీ సర్కార్. ఐఆర్‌ఎస్ ర్యాంక్ ఉన్న జాస్తి కృష్ణ కిశోర్..టీడీపీ సర్కార్ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా  పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

తాజాగా జగన్ సర్కార్.. కృష్ణ కిశోర్‌కి సంబంధించిన శాఖల నుంచి నివేదిక తెప్పించుకుంది. ఆరోపణల తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సదరు అధికారిపై  కేసు నమోదు చేసి, విచారణ చేయాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, ఏసీబీ డీజీ లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం… ఇన్వెస్టిగేషన్ ముగిసే వరకు రాజధాని అమరావతి విడిచి వెళ్లరాదని కృష్ణ కిశోర్‌ను ఆదేశించింది. శ్రీనివాస్ రెడ్డి.. అనే మరో ఆఫీసర్ కూడా అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. కాగా కృష్ణ కిశోర్‌..మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరుంది.