Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

టీటీడీ భూముల అమ్మక తీర్మానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

TTD Lands sale, టీటీడీ భూముల అమ్మక తీర్మానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ)కి చెందిన ఆస్తుల అమ్మక నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2016 జనవరి 30న టీటీడీ ట్రస్ట్ బోర్టు తమకు చెందిన 50 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తీర్మానం నెం. 252 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఆ స్థలాల్లో దేవాలయల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ అంశాలన్నీ పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడం గమనర్హం.

కాగా 2016 తీర్మానానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియలో విక్రయించాలని కొద్ది రోజుల క్రితం టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం మొదలైంది. ఈ క్రమంలో టీటీడీ భూముల అమ్మకంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాతే ముందుకు వెళ్లాలని జగన్ సర్కార్‌ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read This Story Also:  సోమ‌వారం ఒక్కరోజే 532 విమాన సర్వీసులు…

Related Tags