ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…

ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్సకు కీలక శాఖలను కేటాయించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నూతన బాధ్యతలను అప్పగిస్తూ  ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది...

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...
Follow us

|

Updated on: Sep 21, 2020 | 8:18 PM

AP Govt has Allotted Key Portfolios : ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్సకు కీలక శాఖలను కేటాయించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నూతన బాధ్యతలను అప్పగిస్తూ  ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖను ఆయనకు కేటాయించింది.

అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 166 అధికరణలో గల క్లాజ్‌(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ఆరులోని సబ్‌ రూల్‌(1) ప్రకారం ఏపీ‌ గవర్నర్‌, గ్రామ..వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలు కేటాయించినట్లు తెలిపింది.