30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆసుపత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని

30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 6:43 AM

AP Government decision on new medical posts :ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆసుపత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 30,887 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 8,439 మందిని నియమించగా, మిగిలిన పోస్టులకు భర్తీ కొనసాగుతోంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్‌ నర్సులు, ట్రైనీ నర్సులు, పారిశుధ్య సిబ్బందిని నియమించుకోనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్య పెంచాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే.

Read This Story Also: మెగాస్టార్ బర్త్‌డేకు అభిమానుల అదిరిపోయే ప్లాన్‌