సెప్టెంబర్‌ 1నుంచి ఏపీలో సన్నబియ్యం డోర్ డెలివరీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావిస్తున్న సన్నబియ్యాన్ని డోర్ డెలివరీ చేసే విషయంపై  రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు మందుకు వేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో కెబినేట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు పలువురు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. […]

సెప్టెంబర్‌ 1నుంచి ఏపీలో సన్నబియ్యం డోర్ డెలివరీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 21, 2019 | 6:19 PM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావిస్తున్న సన్నబియ్యాన్ని డోర్ డెలివరీ చేసే విషయంపై  రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు మందుకు వేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో కెబినేట్ సబ్ కమిటీ భేటీ అయింది.

ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు పలువురు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం రేషన్‌షాపుల ద్వారా ఇస్తోన్న బియ్యం పక్కదారి పడుతోందని.. తినడానికి అవి పనికిరాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వస్తోన్న బియ్యంలో 25శాతం నూక వస్తోందన్నారు. నాణ్యత లేని బియ్యం సరఫరాతో అన్నం ముద్దలా మారుతోందని చెప్పారు.

అందుకే సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని రేషన్‌ దుకాణాల ద్వారా కేవలం సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు కొడాలి నాని తెల్పారు. రాష్ట్రంలో సరఫరా చేసేందుకు మొత్తం 6లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయని నిర్ణయించామని.. బియ్యం సేకరణకు అవలంబించాల్సిన విధానాలపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు మంత్రి తెలిపారు. ఈ సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వంపై రూ.1000 కోట్లు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా ఈ పంపిణీ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం త్వరలో రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు చేపట్టనున్నారు.