రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం.. ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలిగందన్న ఏపీ గవర్నర్‌

ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో శాంతిభద్రతలను దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌..

రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం.. ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలిగందన్న ఏపీ గవర్నర్‌
Follow us

|

Updated on: Jan 26, 2021 | 3:30 PM

ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో శాంతిభద్రతలను దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వ్యాఖ్యానించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొందరు కుట్ర పన్నారని, వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోలిగిందని గవర్నర్‌ చెప్పారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం జగన్‌, మంత్రులు, గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తన ప్రసంగంలో ఇటీవలి ఘటనలను ప్రస్తావించారు.

మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో గతంలో ఇబ్బందు వచ్చాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయన్నారు. అందుకోసం ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు గవర్నర్‌.