Breaking News
  • చిత్తూరు: పలమనేరు మండలం మండిపేటలో ఎనుగుల విధ్వంసం. పంటపొలాలపై దాడి, కొబ్బరి చెట్లు ధ్వంసం. పశువులపైనా దాడి చేసిన గజరాజులు. దూడ మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలు. భయాందోళనలో రైతులు.
  • ప.గో: భీమడోలు మండలం పొలసానిపల్లిలో హత్యాయత్నం. భర్తను చంపేందుకు యత్నించిన భార్య. కూరలో సైనైడ్‌ కలిపి భర్తకు వడ్డించిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గురునాథ్‌. భార్య రాణి, కొడుకు సహా మరోముగ్గురిపై కేసు నమోదు.
  • హైదరాబాద్‌: పంజాగుట్టలో దొంగల బీభత్సం. అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళలు. ఓ మహిళపై సుత్తితో దాడి చేసిన దొంగ. మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • సెల్ఫ్‌ డిసిప్లేన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైన్‌లు వేసినంత మాత్రానా మార్పు రాదు. వాహనదారులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. బయోడైవర్సిటీ ప్రమాదం తర్వాత అనేక చర్యలు చేపట్టాం. వాహనదారుల్లో మార్పు రాకుంటే నిర్దిష్ట వేగాన్ని కఠినంగా అమలు చేస్తాం. వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేవారు కూడా నష్టపోతున్నారు -టీవీ9తో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.
  • ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత. రెండు రోజుల క్రితం అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థి మృతదేహం లభ్యం. గోపాలపురం దగ్గర ఎన్‌ఎస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు. మృతదేహంతో కలెక్టరేట్‌ దగ్గర బంధువుల ఆందోళన.
  • అమరావతి: ఐటీ దాడుల పూర్తి పంచనామా రిపోర్ట్‌ విడుదల. భారీగా డైరీలు, రిజిస్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఐటీశాఖ. కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్‌. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన లాకర్లు సీజ్‌ చేసినట్టు పంచనామాలో వెల్లడి.

ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

AP Government Transfers 21 IPS Officers, ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 23 మంది ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు వీరికి పోస్టింగులు కూడా కేటాయించింది. కాగా, మంగళవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయిన స్థానాలు..

గుంటూరు రూరల్ ఎస్పీ‌- జయలక్ష్మీ
గుంటూరు అర్బన్ ఎస్పీ‌- బీహెచ్‌వీ రామకృష్ణ
శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి
పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్‌ సింగ్‌
చిత్తూరు ఎస్పీ- సీహెచ్‌ వెంకటప్పలనాయుడు
తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి
విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్‌పాటిల్‌
విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్‌ భాస్కర్‌
కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్‌బాబు
విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి
విజయవాడ జాయింట్‌ సీపీ- నాగేంద్ర కుమార్‌
విజయవాడ డీసీసీ2- సీహెచ్‌ విజయరావు
రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్‌
సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి
అక్టోపస్‌ ఎస్పీ- విశాల్‌ గున్నీ
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ- అశోక్‌కుమార్‌
గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌- రాహులదేవ్‌ శర్మ
ఏలూరు డీఐజీ- ఏఎస్‌ ఖాన్‌
అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్‌
అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు
ఎస్‌ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్‌
సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్‌ వర్మ
కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి

ఏఆర్‌ దామోదర్‌, భాస్కర్‌ భూషణ్‌, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్‌ కార్వర్ట్స్‌ను అటాచ్‌ చేశారు.

Related Tags