రేపటి నుంచి బడిబాట

వేసవి సెలవులు ముగిశాయి. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. సెలవుల్లో నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ అంటూ ఊరికి, బంధువుల ఇళ్లకు వెళ్లి ఎంజాయ్ చేసిన చిన్నారులు రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానికోసం రేపటి నుంచి రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాజన్న […]

రేపటి నుంచి బడిబాట
Follow us

|

Updated on: Jun 11, 2019 | 12:45 PM

వేసవి సెలవులు ముగిశాయి. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. సెలవుల్లో నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ అంటూ ఊరికి, బంధువుల ఇళ్లకు వెళ్లి ఎంజాయ్ చేసిన చిన్నారులు రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానికోసం రేపటి నుంచి రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. తొలిరోజు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని స్కూళ్లలో సంబరాలు నిర్వహించాలని.. పాఠశాలలను సంప్రదాయ బద్దంగా అందంగా అలంకరించి జాతీయ గీతాలాపనతో బడిబాట ప్రారంభించాలని ప్రకటించింది. మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో సంబరాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.