ఏపీకి రూ.2264 కోట్ల రుణం..!

ఏపీ రాష్ట్రానికి రూ.2264 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒప్పందంపై గురువారం ఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ మొత్తం అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు(ఐబీఆర్డీ) నుంచి వస్తాయి. రుణ కాలపరిమితి 23ఏళ్లు కాగా, ఆరేళ్లు అదనపు గడువు లభిస్తుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు ఈ నిధులను ఏపీ ప్రభుత్వం వినియోగించనుంది. 2005లో ప్రతి 100 మందికి 54 శిశు మరణాలు సంభవిస్తే.. ప్రస్తుతం […]

ఏపీకి రూ.2264 కోట్ల రుణం..!
Follow us

|

Updated on: Jun 28, 2019 | 12:14 PM

ఏపీ రాష్ట్రానికి రూ.2264 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒప్పందంపై గురువారం ఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ మొత్తం అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు(ఐబీఆర్డీ) నుంచి వస్తాయి. రుణ కాలపరిమితి 23ఏళ్లు కాగా, ఆరేళ్లు అదనపు గడువు లభిస్తుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు ఈ నిధులను ఏపీ ప్రభుత్వం వినియోగించనుంది. 2005లో ప్రతి 100 మందికి 54 శిశు మరణాలు సంభవిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు తగ్గినట్లు వరల్డ్ బ్యాంక్(డబ్ల్యూబీ) ఈ సందర్భంగా తెలియజేసింది. అటు ప్రభుత్వాసుపత్రుల్లోనే 93% ప్రసవాలు జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కాగా ఏపీలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి సమీర్‌ కుమార్‌ ఖరే తెలిపారు.