ముందు జిల్లాలా..? ఎన్నికలా..?.. డైలామాలో ఏపీ ప్రభుత్వం

ఏపీలో పంచాయితీ ఎన్నికల గడువు ముగిసి దాదాపు పది నెలలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆలోచించి, వాటిని వాయిదా వేసింది. మరోవైపు ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట పంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌.. అనంతరం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే […]

ముందు జిల్లాలా..? ఎన్నికలా..?.. డైలామాలో ఏపీ ప్రభుత్వం
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 06, 2019 | 4:21 PM

ఏపీలో పంచాయితీ ఎన్నికల గడువు ముగిసి దాదాపు పది నెలలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆలోచించి, వాటిని వాయిదా వేసింది. మరోవైపు ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట పంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌.. అనంతరం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే పంచాయితీ ఎన్నికలు నిర్వహించే విషయంలో ఏ ఇబ్బందులు లేవు గానీ.. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం డైలామాలో ఉంది.

అదేంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాను చేస్తామని వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దాని ప్రకారం మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వాటి ఏర్పాటుకు ముందే జిల్లాపరిషత్‌ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే జిల్లాల ఏర్పాటు పూర్తికాకుండా పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదే పరిస్థితి గతంలో తెలంగాణలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రకారం స్థానిక పాలన జరగాలంటే పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ రోజున మొదలుపెట్టినా.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. దీనివల్ల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసుకోవడమా లేక జిల్లాల ఆలోచన ప్రస్తుతానికి విరమించుకోవడమా అనేది కొత్త ప్రభుత్వం తేల్చుకోవాల్సి ఉంటుంది.

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.
'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా
పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా
అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.