సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్‌పై సందిగ్ధత.. హౌస్‌ మోషన్‌ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఏపీ సర్కార్‌

రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్‌పై సందిగ్ధత నెలకొంది. అత్యవసర విచారణకు..

సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్‌పై సందిగ్ధత.. హౌస్‌ మోషన్‌ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఏపీ సర్కార్‌
Follow us

|

Updated on: Jan 22, 2021 | 3:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల అంశం గంటగంటకు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపిన తర్వాత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రేపు తొలి నోటిఫకేషన్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్‌పై సందిగ్ధత నెలకొంది. అత్యవసర విచారణకు సమయం ముగియడంతో… అయోమయం నెలకొంది. నిన్న వేసిన పిటీషన్‌లో అత్యవసర విచారణ అంశాన్ని మెన్షన్‌ చేసింది ప్రభుత్వం.

అయితే దాన్ని పరిగణనలోకి తీసుకునే సమయం మించిపోవడంతో… ఇప్పుడు హౌస్‌ మోషన్‌ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. దీనికైనా సమయం ఉంటుందా? ఉండదా? ఆ లోపు ప్రభుత్వ పిటీషన్‌ వేస్తుందా? అది కూడా సమయం మించి పోతుందా అన్నది ఆసక్తిగా మారింది.