12 సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ ఎంక్వైరీ: సీఎం జగన్

జలవనరుల శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించిన అనంతరం… సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ విచారణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే కొన్ని ప్రాజెక్టులలో రీటెండరింగ్‌ వేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌ల మంజూరు, ఖర్చులపై థర్డ్‌పార్టీ విచారణ జరిపిస్తామని సీఎం స్పష్టంచేశారు. గాలేరు- నగరి, హంద్రీనీవా, పోలవరం, పట్టిసీమ, వంశధార, వెలుగోడు, తోటపల్లి, అవుకు సుజల స్రవంతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఎగువ పెన్నాపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో, […]

12 సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ ఎంక్వైరీ: సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 10:03 PM

జలవనరుల శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించిన అనంతరం… సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ విచారణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే కొన్ని ప్రాజెక్టులలో రీటెండరింగ్‌ వేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌ల మంజూరు, ఖర్చులపై థర్డ్‌పార్టీ విచారణ జరిపిస్తామని సీఎం స్పష్టంచేశారు. గాలేరు- నగరి, హంద్రీనీవా, పోలవరం, పట్టిసీమ, వంశధార, వెలుగోడు, తోటపల్లి, అవుకు సుజల స్రవంతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఎగువ పెన్నాపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో, ఎగువ సీలేరు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్న జగన్, బైరవానితిప్ప ప్రాజెక్టులో రూ.860 కోట్ల అంచనాలు పెంచారని వెల్లడించారు. అన్ని ప్రాజెక్టులపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.