జగన్ లోటస్‌పాండ్‌లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం…నిధులు మంజూరు

ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని నివాసం(లోటస్‌పాండ్‌)లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం ప్రభుత్వం రూ.35.50 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌లోని ఎల్ బ్లాక్‌లో తొలిగించిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను లోటస్‌పాండ్‌లో తిరిగి అమర్చనున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం రిలీజ్ చేసిన నిధులు ఎందుకోసం అంటే : లోటస్‌పాండ్‌లో సీసీ కెమెరాలను రీ ఇన్ట్సాల్ చెయ్యడంతో పాటు ప్రస్తతం ఉన్న సోలార్ సిస్టమ్‌ను మెరుగుపర్చడానికి  18 లక్షల కేటాయింపు […]

జగన్ లోటస్‌పాండ్‌లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం...నిధులు మంజూరు
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 4:41 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని నివాసం(లోటస్‌పాండ్‌)లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం ప్రభుత్వం రూ.35.50 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌లోని ఎల్ బ్లాక్‌లో తొలిగించిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను లోటస్‌పాండ్‌లో తిరిగి అమర్చనున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం రిలీజ్ చేసిన నిధులు ఎందుకోసం అంటే :

  • లోటస్‌పాండ్‌లో సీసీ కెమెరాలను రీ ఇన్ట్సాల్ చెయ్యడంతో పాటు ప్రస్తతం ఉన్న సోలార్ సిస్టమ్‌ను మెరుగుపర్చడానికి  18 లక్షల కేటాయింపు
  • లోటస్‌పాండ్ వద్ద బూమ్ బారికేడ్ల ఏర్పాటుతో నిర్వాహణ కోసం 8 లక్షల నిధులు మంజూరు
  • లోటస్‌పాండ్‌ వద్దనున్న పోలీస్ బ్యారక్స్‌కు ఇరువైపులా ఎలక్ట్రికల్ పనుల కోసం నాలుగున్నర లక్షలు కేటాయింపు
  • నిత్యం లోటస్‌పాండ్‌లో పర్యవేక్షణకు.. నిష్ణాతులైన ఎలక్ట్రికల్ వర్కర్స్‌ని నియమించడానికి  ఏడాదికి గానూ 4 లక్షలు మంజూరు

మొత్తం రూ.35.50లక్షలు విడుదల చేయడానికి ప్రభుత్వం నుంచి జీవో జారీ అయ్యింది. అయితే లోటస్‌‌పాండ్‌ను ఏపీ సీఎం జగన్ నివాసంతో పాటు క్యాంప్ ఆఫీస్‌ అని కూడా సదరు జీవోలో ప్రస్తావించారు.