అగ్రిగోల్డ్ బాధితులకు సాయం.. ఏ జిల్లాకు ఎంతంటే ?

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపనుంది ఏపీ సర్కారు. 10 వేల లోపు డిపాజిటర్లకు మొదటి విడతా పేమెంట్లు ఇవ్వనున్నారు. మూడు లక్షల 69 వేల మందికి 263 కోట్ల రూపాయలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా లీగల్ సెల్ ద్వారా నగదు అందజేయనుంది. మరో వైపు 20 వేల రూపాయల […]

అగ్రిగోల్డ్ బాధితులకు సాయం.. ఏ జిల్లాకు ఎంతంటే ?
Follow us

|

Updated on: Oct 19, 2019 | 3:30 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపనుంది ఏపీ సర్కారు. 10 వేల లోపు డిపాజిటర్లకు మొదటి విడతా పేమెంట్లు ఇవ్వనున్నారు. మూడు లక్షల 69 వేల మందికి 263 కోట్ల రూపాయలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా లీగల్ సెల్ ద్వారా నగదు అందజేయనుంది. మరో వైపు 20 వేల రూపాయల లోపు డిపాజిటర్లకు కూడా చెల్లించేందుకు రెండు విడత కోసం సన్నాహాలు చేస్తోంది. కోర్టు సూచనల మేరకు చెల్లింపులు చేయబోతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 1150 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం నుంచి బాధితులకు డబ్బులు ఇవ్వబోతుంది ప్రభుత్వం.

సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రతీ జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వారు సహా వేలాది మంది మధ్య తరగతి జనం అగ్రిగోల్డ్‌లో తమ డబ్బు డిపాజిట్ చేశారు. మోసపోయామని తెలిసి.. తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని.. పాదయాత్రలో జగన్‌ను కోరారు బాధితులు.

10వేల లోపు వారికి ఊరట..

పది వేల రూపాయలలోపు డిపాజిటర్లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతుంది ప్రభుత్వం. జిల్లాల వారిగా బాధితులు.. వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే..

  • గుంటూరు జిల్లాలో 19,751 మందికి 14 కోట్ల 9 లక్షల రూపాయలు
  • చిత్తూరు జిల్లాలో 8,257 మందికి 5 కోట్ల 81 లక్షల రూపాయలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 19,545 మందికి 11 కోట్ల 46 లక్షల రూపాయలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 35,496 మందికి 23 కోట్ల 5 లక్షల రూపాయలు
  • విజయనగరం జిల్లాలో 57,491 మందికి 36 కోట్ల 97 లక్షల రూపాయలు
  • శ్రీకాకుళం జిల్లాలో 45, 833 మందికి 31 కోట్ల 41 లక్షల రూపాయలు
  • కర్నూలు జిల్లాలో 15,705 మందికి 11 కోట్ల 14 లక్షల రూపాయలు
  • నెల్లూరు జిల్లాలో 24,930 మందికి 16 కోట్ల 91 లక్షల రూపాయలు
  • కృష్ణా జిల్లాలో 21,444 మందికి 15 కోట్ల 4 లక్షల రూపాయలు
  • అనంతపురం జిల్లాలో 23,838 మందికి 20 కోట్ల 64 లక్షల రూపాయలు
  • కడప జిల్లాలో 18,864 మందికి 13 కోట్ల 18 లక్షల రూపాయలు
  • ప్రకాశం జిల్లాలో 26,586 మందికి 19 కోట్ల 11 లక్షల రూపాయలు
  • విశాఖపట్నంలో 52,005 మందికి 45 కోట్ల 10 లక్షల రూపాయలు