గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు.. ఈసారి ఎన్ని పోస్టులంటే..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. గ్రామ సచివాలయాల్లో మొత్తం 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ పోస్టులకు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జనవరి 31వ తేదీ వరకు తుది గడువు అని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు గిరిజా శంకర్ పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి […]

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు.. ఈసారి ఎన్ని పోస్టులంటే..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2020 | 10:01 AM

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. గ్రామ సచివాలయాల్లో మొత్తం 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ పోస్టులకు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జనవరి 31వ తేదీ వరకు తుది గడువు అని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు గిరిజా శంకర్ పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి తరువాత రాత పరీక్ష ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. వీటికి సంబంధించి gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.

మరోవైపు వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 31వ తేది వరకు గడువు ఇచ్చారు. wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్లలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.