ప్రాథమిక విద్యకు 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ విడుద‌ల‌…

ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీరభద్రుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డిఈఓలు ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

ప్రాథమిక విద్యకు 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ విడుద‌ల‌...
Follow us

|

Updated on: Jul 10, 2020 | 10:20 PM

ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీరభద్రుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డిఈఓలు ఎన్సీఈఆర్టి  ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడ‌ద‌ని, విద్యార్థుల‌కు మార్కులు, రాంక్ లు కేటాయించ‌కూడ‌ద‌ని ఆదేశించారు. కాగా ఎన్సీఈఆర్టి ప్రత్యామ్నాయ విద్య సంవత్సర క్యాలెండర్ ను సిద్దం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు ఆ క్యాలండర్ ను పాటించాల‌ని చిన వీర‌భ‌ద్రుడు సూచించారు. కాగా ఆన్లైన్ లెర్నింగ్ ను ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించి ఫీజులు చెల్లించమంటున్నారని ఫిర్యాదులు వెల్లువ‌లా వ‌స్తున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా పూర్తి అకడమిక్ క్యాలెండర్ రూపొందించ‌లేద‌ని..పనిదినాలు, సిలబస్ తగ్గింపు ద్వారా విద్యార్థుల‌పై ఒత్తిడి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చిన వీరభద్రుడు తెలిపారు. టీచర్లు….సోషల్ మీడియా, టెక్నాల‌జీ సాయంతో పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థుల‌కు స‌హ‌కారం అందించాలని చిన వీరభద్రుడు కోరాడు. కాగా తాజాగా ఎన్సీఈఆర్టి… 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ ను ప్రాథమిక విద్యకు విడుదల చేసింది.