తుడా పరిధిలోకి 13 మండలాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

తుడా పరిధిలోకి 13 మండలాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
Follow us

|

Updated on: Oct 21, 2020 | 5:14 PM

AP Government Orders: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీతో సహా మరో 13 మండలాలను తుడాలోకి విలీనం చేస్తూ రాష్ట్ర పురపాలిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న 11 గ్రామాలను మినహాయించి.. తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని కలిపింది. కాగా, నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాలు కొత్తగా వచ్చి చేరడంతో.. తుడా పరిధి 4472 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

Also Read: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 6500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.!