ఏపీ: నవంబర్ 2 నుంచి స్కూళ్లు.. టీచర్లకు కరోనా పరీక్షలు.!

కరోనా కారణంగా ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ 2వ తేదీ..

  • Ravi Kiran
  • Publish Date - 12:17 pm, Sun, 25 October 20
Schools Re-Open Telangana

Teachers To Do Corona Tests: కరోనా కారణంగా ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ 2వ తేదీ నుంచి స్కూళ్లు తెరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే స్కూళ్లకు చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా టీచర్లు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపిన ప్రభుత్వం.. వాటి రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపించాలని సూచించింది.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..