ట్యూషన్‌ ఫీజు 30శాతం తగ్గించాలి..ఏపీ సర్కార్ ఉత్తర్వులు

 ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో‌ ట్యూషన్‌ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Ram Naramaneni
  • Publish Date - 9:34 pm, Fri, 30 October 20

 ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో‌ ట్యూషన్‌ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం విద్యాశాఖ విడుదల చేసింది. కరోనా‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ట్యూషన్‌ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇక ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. 2 వ తారీఖు నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. నవంబర్ 23 నుంచి 6,7,8 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14  తేదీ నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు స్టార్టవుతాయి.  పాఠశాలల్లో  రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నట్లు  ప్రభుత్వం తెలిపింది. అది కూడా  ఒంటిపూట బడులు  మాత్రమే క్లాసులు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Also Read :

హైదరాబాద్‌ శివారులో అన్నాచెల్లెళ్లు మిస్సింగ్

Breaking : టర్కీలో భారీ భూకంపం, అల్లకల్లోలం !