ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం…ఆంక్షలు లేని రైలు ప్రయాణం

ఏపీ స‌ర్కార్ క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో ప్రయా‌ణాల‌కు సంబంధించి మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో అంత‌ర్గ‌త‌ ట్రైన్ జ‌ర్నీల‌పై ఆంక్ష‌లు తొల‌గిస్తున్న‌ట్లు అనౌన్స్ చేసింది. రాష్ట్ర ప‌రిధిలో ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా ట్రైన్ జ‌ర్నీ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ట్రైన్ ఆగే స్టేష‌న్ వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. జూన్ 4 నుంచి నడిచే స్పెష‌ల్ ట్రైన్స్ స్టాపుల‌ను త‌గ్గిస్తున్నట్లు ప్రభుత్వం వివ‌రించింది. కాగా, ఆంధ్రప్ర‌దేశ్ కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి […]

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం...ఆంక్షలు లేని రైలు ప్రయాణం
Follow us

|

Updated on: Jun 03, 2020 | 1:28 PM

ఏపీ స‌ర్కార్ క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో ప్రయా‌ణాల‌కు సంబంధించి మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో అంత‌ర్గ‌త‌ ట్రైన్ జ‌ర్నీల‌పై ఆంక్ష‌లు తొల‌గిస్తున్న‌ట్లు అనౌన్స్ చేసింది. రాష్ట్ర ప‌రిధిలో ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా ట్రైన్ జ‌ర్నీ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ట్రైన్ ఆగే స్టేష‌న్ వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. జూన్ 4 నుంచి నడిచే స్పెష‌ల్ ట్రైన్స్ స్టాపుల‌ను త‌గ్గిస్తున్నట్లు ప్రభుత్వం వివ‌రించింది. కాగా, ఆంధ్రప్ర‌దేశ్ కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి బోర్డ‌ర్స్ లో తనిఖీల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. సరిహద్దు జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ-పాస్‌ మాత్రమే పరిశీలించి అనుమతిస్తుంగా… మరికొన్ని చోట్ల ఈ-పాస్‌తోపాటు మెడిక‌ల్ టెస్టులు సైతం నిర్వహించారు. దీంతో బోర్డ‌ర్ ప్రాంతాల వ‌ద్ద‌ కొన్నిచోట్ల వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చేవారికి కొన్ని ఇబ్బందులు ఉండ‌టం స‌హ‌జం. కానీ రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రం ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ అనేక మినహాయింపులు ఇచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు స‌హా ఇతర రవాణా వాహనాలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగానే రాష్ట్రం లోపల రైళ్ల ప్రయాణికులకు ఆంక్షలు లేవని ప్ర‌భుత్వం పేర్కొంది.