హైకోర్టు ఆదేశాల‌పై.. సుప్రీంకోర్టుకు ఏపీ స‌ర్కార్..!

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ రమేశ్ ఆస్పత్రి అధినేత రమేష్ బాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై గత మంగళవారం విచారణ చేపట్టింది హైకోర్టు.

హైకోర్టు ఆదేశాల‌పై.. సుప్రీంకోర్టుకు ఏపీ స‌ర్కార్..!
Follow us

|

Updated on: Sep 02, 2020 | 10:04 AM

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ రమేశ్ ఆస్పత్రి అధినేత రమేష్ బాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై గత మంగళవారం విచారణ చేపట్టింది హైకోర్టు. డాక్టర్ రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులకు చేరుస్తారా? అని ప్రశ్నించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.