Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • కామారెడ్డి జిల్లా పరిధిలోని దేవునిపల్లి గ్రామ స్మశాన వాటిక లో దారుణం. శవాలు కాలాక ముందే పక్కకు తొలగించి వాటిపై బంగారాన్ని దొంగిలిస్తున్న కాటికాపర్లు. పూడ్చిన శవాలను సైతం బయటకు తీస్తున్న వైనం. కాటికాపరుల ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల డిమాండ్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • అమరావతి: 3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో మరో పిల్. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు. అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్. సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్. జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్. కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి.

జగన్ కీలక నిర్ణయం.. మరిన్ని కరోనా వైద్య ప్రక్రియలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి..

Corona medical fee in private hospitals, జగన్ కీలక నిర్ణయం.. మరిన్ని కరోనా వైద్య ప్రక్రియలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి..

Corona medical fee in private hospitals: కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స అందజేయనున్నారు. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా నిర్ధారించింది. క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్‌ చేయనున్నారు. వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు.

కోవిద్-19 సంక్రమణ ఉన్నవారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా ఉండనుంది. ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Tags