శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ చేసిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి, నిధుల వినియోగానికి జగన్ సర్కార్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ చేసిన సర్కార్
Follow us

|

Updated on: Oct 03, 2020 | 1:56 PM

ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి, నిధుల వినియోగానికి జగన్ సర్కార్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శిల్పారామాల డెవలప్‌మెంట్‌తో  పాటు వివిధ నిర్మాణాల కోసం 10 కోట్ల రూపాయలను గవర్నమెంట్ కేటాయించింది. శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ ఫస్ట్ ఫేజ్‌లో 3 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా,  సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణాలు జరపాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసింది.

పంచ మఠాల సుందరీకరణ కూడా :

కర్నూలు జిల్లాలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవ‌స్థానం త‌రువాత పంచ మ‌ఠాలు బాగా ప్ర‌సిద్ది చెందాయి. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వాటి డెవ‌ల‌ప్‌మెంట్ కోసం అధికారులు ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో అవి క‌ళ త‌ప్పాయి. దీంతో తాజాగా దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించారు ఎండోమెంట్ అధికారులు. పంచ మ‌ఠాలను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. భ‌క్తుల సంద‌ర్శ‌న కోసం వాటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఘంటామఠము, రుద్రాక్షమఠము, విభూది మఠము, భీమాశంకర మఠం, సారంగాధర మఠం..మొత్తం ఐదు మ‌ఠాల‌ను సుందరీక‌ర‌ణ చేయ‌నున్నారు. పునరుద్ధరణ పనులు రూ 2.70 కోట్లు కేటాయించారు. అంతేకాదు పంచ మ‌ఠాలు టూరిజం హ‌బ్ మార్చ‌బోతున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Also Read :

సీఎం జగన్ భారీ కటౌట్ కు క్రేన్ ద్వారా పాలాభిషేకం

ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?

సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం, వైఎస్ భారతి తండ్రి కన్నుమూత