Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ఏపీలో ‘దిశ బిల్లు’..తప్పు చేస్తే, 21 రోజుల్లోనే

Andhra Pradesh assembly clears Disha Bill to ensure death in rape verdicts in 21 days, ఏపీలో ‘దిశ బిల్లు’..తప్పు చేస్తే, 21 రోజుల్లోనే

ఏపీ అసెంబ్లీలో సంచలన ‘దిశ బిల్లు’ను  ప్రభుత్వం చర్చకు తీసుకువచ్చింది. హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు.  యాసిడ్ దాడుల, అత్యాచారం వంటి తీవ్రమైన  నేరాలకు పాల్పడేవారికి వార్నింగ్ సైన్స్ ఇచ్చేసింది ఏపీ సర్కార్.  కచ్చితమైన ఆధారాలు లభ్యమైతే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన తీవ్ర కలత చెందిన ఏపీ సీఎం జగన్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సంకల్పించారు.

ఇంత గొప్ప బిల్లును  ప్రవేశపెట్టే అవకాశం తనకు కల్పించినందుకు  కల్పించినందుకు సీఎం జగన్‌కు, హోమంత్రి సుచరిత ధన్యవాదాలు తెలిపారు. దళిత మహిళను హోమంత్రిని, గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్‌ చెల్లుతుందని ఆమె కొనియాడారు. దిశ ఘటన జనాల్లో భయాన్ని తీసుకొచ్చిందని, తమ ఆడ బిడ్డలు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏంటి అన్న భయం.. పేరెంట్స్‌లో వ్యక్తమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళందరికి జగనన్న రక్ష..మహిళల జోలికి వస్తే పడుతుంది కఠిన శిక్ష అని వెల్లడించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవడం ప్రధాన సారాంశమని హోంమంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతుందని, శిక్షల అమలులో కూడా జాప్యం ఉండదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా ఫోస్టింగ్స్ చేసేవాళ్లకి.. రెండు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించబోతున్నట్టు తెలిపారు.