నేడు అసెంబ్లీలోకి 11 కీలక బిల్లులు..!

గత వారం రోజులుగా.. ఏపీ అసెంబ్లీ ఘాటు ఘాటు చర్చలతో కాస్త హాట్‌గానే నడుస్తోంది. మేము గొప్ప అంటే.. మేము గొప్ప అని ఇరు పక్షాలు అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ.. వీరి విమర్శలతోనే వారం రోజులు గడిచిపోయాయి.  అయితే.. ఇన్ని జరుగుతున్నా.. మహిళలకు న్యాయం చేసే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో 11 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, మద్యంపై ఎక్కువగా […]

నేడు అసెంబ్లీలోకి 11 కీలక బిల్లులు..!
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2019 | 7:48 AM

గత వారం రోజులుగా.. ఏపీ అసెంబ్లీ ఘాటు ఘాటు చర్చలతో కాస్త హాట్‌గానే నడుస్తోంది. మేము గొప్ప అంటే.. మేము గొప్ప అని ఇరు పక్షాలు అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ.. వీరి విమర్శలతోనే వారం రోజులు గడిచిపోయాయి.  అయితే.. ఇన్ని జరుగుతున్నా.. మహిళలకు న్యాయం చేసే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో 11 కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, మద్యంపై ఎక్కువగా చర్చ సాగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. సీఎం జగన్ తీసుకొచ్చిన నవరత్న పథకాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ శీతాకాల సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే జరగనున్నాయని సమాచారం. మరి  ఈ బిల్లులు ఇప్పుడు గనుక ఈ బిల్లులు పాస్ అవ్వకపోతే.. మళ్లీ వచ్చే ఏడాది వరకూ బడ్జెట్ సమావేశాల వరకూ వేచి చూడక తప్పదు.

11 కీలక బిల్లులు:

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ల బిల్లులపై చర్చ
  • కాఫీ, టీ బోర్డు తరహాలో చిరు, పప్పు ధాన్యాల బోర్డులు
  • ఆర్టీసీ ఉద్యోగలు విలీనం కోసం కొత్త చట్టం
  • మద్యం అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు
  • మద్యంపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధింపు
  • మార్కెట్ కమిటీల పునర్‌ వ్యవస్థీకరణ
  • కొత్తగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్
  • అండ్‌ ఫైన్ ఆర్ట్స్ యూనిర్శిటీ ఏర్పాటు
  • యూనివర్శిటీల చట్టంలో సవరణలు
  • ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ చట్టంలో సవరణ
  • ఏపీ ట్యాక్స్ ఆన్ ప్రొఫఎషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణలు