నేచురల్ గ్యాస్‌పై వ్యాట్ పెంపు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

రాష్ట్రంలో సహజ వాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్న ఆధారిత పన్నును...

నేచురల్ గ్యాస్‌పై వ్యాట్ పెంపు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
Follow us

|

Updated on: Sep 12, 2020 | 12:43 PM

Vat On Natural Gas: రాష్ట్రంలో సహజ వాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 14.5 శాతంగా ఉన్న ఆధారిత పన్నును 24.5 శాతానికి పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ముడి చమురుపై 5 శాతం, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుండగా.. డీజిల్‌పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇక ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్‌పై 1 శాతం వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తోంది.

కోవిడ్ కారణంగా పన్నులపై ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజ వాయువుపై అదనంగా 10 శాతం మేరకు వ్యాట్ పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్ నెలకు రూ. 4480 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ. 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. రైతు భరోసా, నాడు- నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మ ఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన