థియేటర్ల యజమానులకు భారీ ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం.. 6 నెలల మారటోరియంతో రుణాలు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఆదుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాయితీలు ప్రకటించింది. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

థియేటర్ల యజమానులకు భారీ ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం.. 6 నెలల మారటోరియంతో రుణాలు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
Follow us

|

Updated on: Dec 18, 2020 | 9:07 PM

ap government gives big relief to movie industry: కరోనా కారణంగా అతలాకుతలమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి థియేటర్లు మూత పడడంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఆదుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాయితీలు ప్రకటించింది. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు రీస్టార్ట్ ప్యాకేజీ కింద థియేటర్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి, సెంటర్లలో రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ రుణాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు కృత‌జ్ఙ‌త తెలిపారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయం ఎనలేనిదని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనియాడారు.