ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం… వారికి రూ. 5 వేల ఆర్థిక‌ సాయం

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లో భాగంగా దేశ‌మంతా లాక్ డౌన్ అమ‌ల‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌భావంతో పలు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో పేద‌ అర్చకులను ఆదుకునేందుకు స‌ర్కార్ న‌డుం బిగించింది. చిన్న, చిన్న‌ దేవాలయాలలో పనిచేసే అర్చకుల‌కు.. ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు ఇవ్వాలని స‌ర్కార్ నిర్ణ‌యించిన‌ట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల్ల‌ ఏప్రిల్ […]

ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం... వారికి రూ. 5 వేల ఆర్థిక‌ సాయం
Follow us

|

Updated on: Apr 08, 2020 | 4:39 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లో భాగంగా దేశ‌మంతా లాక్ డౌన్ అమ‌ల‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌భావంతో పలు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో పేద‌ అర్చకులను ఆదుకునేందుకు స‌ర్కార్ న‌డుం బిగించింది. చిన్న, చిన్న‌ దేవాలయాలలో పనిచేసే అర్చకుల‌కు.. ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు ఇవ్వాలని స‌ర్కార్ నిర్ణ‌యించిన‌ట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల్ల‌ ఏప్రిల్ 14 వరకు దేవాలయాల్లో భ‌క్తుల రాకను నిషేధించారు. దీంతో దేవుళ్ల‌కు అర్చ‌కులు ప్ర‌తిరోజు నిత్య కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే ప్రస్తుతం అర్చ‌కుల కోసం “ధూప దీప నైవేద్యం”, “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా 2800 పైగా ల‌బ్ధి చేకూరుతుంది. కానీ చిన్న దేవాలయాలలో అర్చకులు ఉన్న‌వారికి ఎటువంటి ఆదాయ వనరులు లేని ప‌రిస్థితి ఉంది. ఈ రెండు పథకాల్లో లేని వారు రాష్ట్రంలో 2500 మంది దాకా ఉంటారని స‌ర్కార్ అంచ‌నా వేస్తోంది. వారి కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆర్థిక సాయం ప్ర‌తిపాద‌న సిద్దం చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. ఏ పథకం క్రింద లబ్దిచేకూరని అర్చకులకు ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయబడుతుందని ఆయన వివరించారు.