ఏపీ : ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​ నుంచి మినహాయింపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి  మినహాయింపు ఇచ్చింది.

  • Ram Naramaneni
  • Publish Date - 10:43 pm, Mon, 26 October 20

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి  మినహాయింపు ఇచ్చింది. ప్రాజెక్టు అమలుకు 2019లో ఏఐఐ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరిగింది. కొత్త విధానం ప్రకారం ప్రాజెక్టు అమలు చేయడానికి ఏఐఐ బ్యాంకు నిరాకరించింది. పాత నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని  సూచించింది.ఈ క్రమంలో ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ పురపాలకశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏఐఐ బ్యాంకు నిధులు 5,350 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు పాలనా అనుమతులు ఇచ్చింది.

Also Read :

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును