ఉచితంగా బైకుల పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్..?

ఏపీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా బైక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. అంగవైకల్యంతో ఉన్నవారు ఏదైనా సొంతంగా ఉపాధి చేసుకోవడం కోసం ఉచితంగా మూడు చక్రాల బైకులను ఇవ్వనుందట జగన్ సర్కార్. ఇక దీనిని అప్లై చేసుకోవడం ఎలాగంటే.? దివ్యాంగులు తమ వివరాలను గ్రామ వాలంటీర్లకు అందించాల్సి ఉంది. ఇక […]

ఉచితంగా బైకుల పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్..?
Follow us

|

Updated on: Nov 17, 2019 | 7:10 PM

ఏపీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా బైక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. అంగవైకల్యంతో ఉన్నవారు ఏదైనా సొంతంగా ఉపాధి చేసుకోవడం కోసం ఉచితంగా మూడు చక్రాల బైకులను ఇవ్వనుందట జగన్ సర్కార్. ఇక దీనిని అప్లై చేసుకోవడం ఎలాగంటే.?

దివ్యాంగులు తమ వివరాలను గ్రామ వాలంటీర్లకు అందించాల్సి ఉంది. ఇక వాలంటీర్లు ఇచ్చిన ఫామ్‌ను పూర్తి చేసి.. ఆధార్ కార్డు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్‌డ్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌లను ఇవ్వాలి. ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. దాని జిరాక్స్‌ను కూడా పొందుపరచాలి. కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2500 మందికి బైకులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం దాదాపు 22 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బైకులు ఉచితంగా ఎవరికి ఇస్తారనేది సదరు పంచాయతీ ఆఫీసుల్లో లిస్ట్ పెడతారని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కావలసిన చర్యలన్నీ తీసుకుంటోందని చెప్పాలి.