కరోనాపై పోరులో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేది నుంచి మొదలుపెట్టనున్న 5వ విడత ఇంటింటా సర్వే ద్వారా ప్రజలందరికీ కరోనా నివారణా చర్యలపై విస్తృత అవగాహన కల్పిస్తామని సీఎస్ నీలం సాహ్ని వెల్లడించారు. ఈ నేపధ్యంలో కరోనాపై రెండు కరపత్రాలను ప్రచురించామని.. ఒకదానిలో కోవిడ్ 19 లక్షణాలు, టెస్టులు, చికిత్స గురించి ఉండగా.. మరోదానిలో కరోనా వ్యాప్తి నివారణ మార్గాలను ముద్రించామని తెలిపారు. కరోనా లక్షణాలు.. […]

కరోనాపై పోరులో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
Follow us

|

Updated on: May 24, 2020 | 12:29 AM

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేది నుంచి మొదలుపెట్టనున్న 5వ విడత ఇంటింటా సర్వే ద్వారా ప్రజలందరికీ కరోనా నివారణా చర్యలపై విస్తృత అవగాహన కల్పిస్తామని సీఎస్ నీలం సాహ్ని వెల్లడించారు. ఈ నేపధ్యంలో కరోనాపై రెండు కరపత్రాలను ప్రచురించామని.. ఒకదానిలో కోవిడ్ 19 లక్షణాలు, టెస్టులు, చికిత్స గురించి ఉండగా.. మరోదానిలో కరోనా వ్యాప్తి నివారణ మార్గాలను ముద్రించామని తెలిపారు.

కరోనా లక్షణాలు.. ఎలా వ్యాప్తి చెందుతుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై ఎఎన్ఎం, ఆశావర్కర్, గ్రామ, వార్డు వాలంటీర్లతో కూడిన బృందం ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సీఎస్ తెలిపారు. కాగా, ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది.