జగన్ సర్కార్ సంచలనం.. సొంత భవనాల్లోనే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు..

పేద ప్రజల ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేస్తున్న 'వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌'లను...

జగన్ సర్కార్ సంచలనం.. సొంత భవనాల్లోనే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2020 | 2:23 PM

YSR Health Clinics: పేద ప్రజల ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేస్తున్న ‘వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌’లను ఏడాదిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిల్లో 80 శాతం కేంద్రాలకు సొంతంగా భవనాలు లేవు.

కొన్ని చోట్ల అయితే ఈ కేంద్రాలు చిన్న గుడిసెల్లో.. కూలిపోయే స్టేజిలో ఉన్న భవనాల్లో ఉన్నాయి. ఇక మీదట ఇలాంటి పరిస్థితి రాకూడదని ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం భవనాల్లో పూర్తి సదుపాయాల్లో ఈ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 పైగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే 8,890 కేంద్రాలు కొత్తగా నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికే 8,724 ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనులు మొదలైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లతో పేదలకు ఎంతో మేలు…

  • ప్రతి 2,500 మందికి ఒక ఆరోగ్య ఉపకేంద్రం
  • కనీసం 90 రకాల మందులు, అన్ని రకాల టీకాలు అందుబాటులోకి..
  • ప్రతి హెల్త్‌ క్లినిక్‌ లోనూ ఒక మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌
  • చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇకపై పీహెచ్‌సీలకు వెళ్లే అవసరం ఉండదు.
  • హెల్త్ క్లినిక్‌లో ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటుంది.
  • గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకోవచ్చు.
  • తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,100 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం.

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

విజయవాడ మీదుగా 24 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..!