Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

పేదలకు సెంటు భూమి ఫ్రీ.. జగన్ మార్క్ డెసిషన్

New Land Distribution Policy, పేదలకు సెంటు భూమి ఫ్రీ.. జగన్ మార్క్ డెసిషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో కీలకమైన పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి కొత్త రూల్స్‌‌ను జారీ చేశారు. పేదవాళ్లందరికి పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వడం వల్ల.. ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాక జీ+3( గ్రౌండ్ ఫ్లోర్ + 3 అంతస్థుల) అపార్ట్‌మెంట్లను నిర్మించి.. అందరికి ఫ్లాట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలనుకునేవారు.. తమ రేషన్ కార్డు జిరాక్స్‌ను  ప్రూఫ్‌గా ఇవ్వాల్సి ఉంటుందట. అటు రేషన్ కార్డు లేనివారు కూడా.. మీసేవ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందజేసి.. దరఖాస్తు చేసుకోవచ్చునని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలన్నది జగన్ సర్కార్ లక్ష్యం. దానికి అనుగుణంగా అధికారులు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తహశీల్దారులు తమ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూముల వివరాల్ని ప్రభుత్వానికి అందించనున్నారు. అంతేకాకుండా అక్రమాలకు తావు లేకుండా లబ్దిదారులకు స్థలాలను కేటాయించేటప్పుడు.. వారి ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాల్ని దానితో లింక్ చేస్తారు. దీనికి అదనంగా రూ.20 అవుతుంది. అందులో రూ.10 స్టాంపు పేపరు, మిగిలిన రూ.10 పట్టా ల్యామినేషన్‌కు ఖర్చు అవుతుంది. ఇక భూమి వచ్చాక.. ఐదేళ్ల పాటు దాన్ని ఎవరికి అమ్మకూడదు. ఆ తర్వాత నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) అనేది అవసరం లేకుండా ఎవరికైనా అమ్ముకోవచ్చునని సమాచారం. కాగా, స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు.