కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. ఏపీ సర్కార్ బంపరాఫర్

దేశవ్యాప్తంగా మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో కోయకుండానే సామాన్యుల కంట కన్నీళ్లను తెప్పిస్తోంది ఉల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర సుమారు రూ.50 పలుకుతుండగా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో రూ.25కే కిలో ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. మహారాష్ట్ర నుండి 300ల టన్నుల ఉల్లిని […]

కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. ఏపీ సర్కార్ బంపరాఫర్
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 8:16 AM

దేశవ్యాప్తంగా మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో కోయకుండానే సామాన్యుల కంట కన్నీళ్లను తెప్పిస్తోంది ఉల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర సుమారు రూ.50 పలుకుతుండగా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో రూ.25కే కిలో ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. మహారాష్ట్ర నుండి 300ల టన్నుల ఉల్లిని కిలో రూ.30 చొప్పున కొనుగోలు చేశామని, రైతు బజార్లలో కిలో 25 రూపాయలకే అందిస్తామని ఆయన తెలిపారు.

అయితే భారీ వర్షాల వలనే ఉల్లి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నారని.. అందుకే ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే పెరిగిన ఉల్లి ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా చాలా నష్టపోయాయని ఈసారి మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు.