Breaking News
 • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
 • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
 • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
 • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
 • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం..వైఎస్ఆర్ పేరుతో..?

ap cabinet crucial decisions, జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం..వైఎస్ఆర్ పేరుతో..?

ఏపీ కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ బుధవారం తీసుకుంది. దాంతోపాటు అమ్మ ఒడి పథకాన్ని జనవరిలో లాంచ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం 6 వేల 450 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ కార్పోరేషన్ విభజనకు జగన్ కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే :

 • అమ్మ ఒడి కోసం రూ. 6450 కోట్ల కేటాయింపునకు ఆమోదం.
 • ఒకటి నుంచి ఇంటర్మిడీయేట్ వరకు చదవే పిల్లల తల్లులకు.. లేదా గార్డియన్లకు సాయం.
 • రేషన్ కార్డు కోసం అప్లై చేసి ఉన్న అక్నాలెడ్జిమెంట్ ఉన్న దరఖాస్తుల ఆమోదం
 • జనవరి నెలలో అమ్మ ఒడి పథకం అమలు
 • 77 మండలాల్లో గర్బిణులకు.. పిల్లలకు అదనంగా పౌష్టికాహారం.
 • కృష్ణా-గోదావరి కాల్వల శుద్ధి మిషనుకు ఆమోదం.
 • ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజనకు గ్రీన్ సిగ్నల్.
 • మాల, మాదిగ, రెల్లి ఇతర కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ల ఏర్పాటుకు లైన్ క్లియర్.
 • పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన.
 • వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులివ్వాలని నిర్ణయం.
 • జనవరి-26, ఆగస్టు-15 రెండు సార్లు అవార్డుల అందచేత.
 • పురస్కార గ్రహీతలకు రూ. 10 లక్షలు పారితోషికం.
 • జెరూసలెం, మక్కా యాత్రలకు వెళ్లే వారికి ఆర్ధిక సాయం పెంపు.
 • స్టోన్ క్రషింగ్ యూనిట్ల ద్వారా రోబో శాండ్ తయారీని ప్రొత్సహించాలని నిర్ణయం.
 • ప్రభుత్వ నిర్మాణాల్లో 50 శాతం రోబో శాండ్ ఉపయోగించాలని కెబినెట్ నిర్ణయం.
 • డిస్కంల ఆర్ధిక వెసులుబాటు కోసం బాండ్ల జారీ నిర్ణయాన్ని రాటిఫై చేసిన కెబినెట్.
 • 147 వైఎస్సార్ అగ్రీ ల్యాబులు. జిల్లా స్థాయి అగ్రీ ల్యాబులు.. నాలుగు ప్రాంతీయ కోడింగ్ సెంటర్ల ఏర్పాటుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్.
 • 9 కోస్తా జిల్లాల్లో అక్వా ల్యాబుల ఏర్పాటు.
 • న్యాయవాదుల సంక్షేమ నిధి పెంపునకు చర్యలు.. రూ. 2 స్టాంప్ రూ. 20లుగా చేయాలని నిర్ణయం.
 • నవంబర్ ఏడో తేదీన అగ్రీ గోల్డ్ బాధితులకు చెల్లింపులు.
 • రూ. 20వేల లోపు ఉన్న డిపాజిట్ దారులకు చెల్లింపులు.
 • నవంబర్ 14 నుంచి నాడు-నేడు పథకం ప్రారంభం.
 • నవంబర్ 21న ఫిషింగ్ బోట్లకు సబ్సిడీపై డిజీల్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం.
 • వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సాయం అందచేత.
 • రోబో శాండ్ తయారు చేసే స్టోన్ క్రషింగ్ యూనిట్లకు మెషినరీ కొనుగోలు నిమిత్తం పావలా వడ్డీకే రుణాలు.

Related Tags