Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • భారత్ బయోటెక్‌కు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ. భారత కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని సూచన. ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్ చేస్తే ఆగస్ట్ 15 నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్. పంద్రాగస్టు సందర్భంగా వ్యాక్సిన్ లాంఛ్ చేసే అవకాశం.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • తల్లితండ్రుల పిల్ పై హైకోర్టులో విచారణ వాయిదా. 13వ తారీఖున సమగ్ర నివేదికతో రమ్మని ప్రభుత్వానికి చెప్పిన హైకోర్టు. ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని కోర్టుకు తెలిపిన ఏజీ. ఏ నిర్ణయం తీసుకోకుండా ఆన్లైన్ క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు. కేసులో ఇంప్లీడ్ అయిన ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్. రెండు నెలల క్రితమే సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభమైందని తెలిపిన isma తరపు సీనియర్ న్యాయవాది. ఆన్లైన్ తరగతులపై తల్లిదండ్రులకు పై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆన్లైన్ క్లాసెస్ ఆప్షన్ మాత్రమే అని తెలిపిన ఇస్మా తరపు న్యాయవాది.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. ఉపరితల ఆవర్తనం తో పాటు షీర్ జోన్ ఏర్పడింది. ఆంధ్ర తీరానికి సమీపంలో కేంద్రీక`తమైన ఆవర్తనం. పశ్చిమ బంగాళాఖాతం లో 3.1 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. - వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు రాజారావు.
  • జ్యూడిషయల్ లోకరోనా కలకలం . సికింద్రాబద్ జ్యుడీషయల్ అకాడమీ లో కరోనాతో అటెండర్ మృతి . జ్యుడిషయల్ అకాడమీ కేంద్రం గా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్. ఆందోళనలో న్యాయవాదులు.

మళ్ళీ ఆయనకే పట్టం.. నిరీక్షణ ఫలించేది రేపే !

ramana dixitulu to be chief priest soon, మళ్ళీ ఆయనకే పట్టం.. నిరీక్షణ ఫలించేది రేపే !
ఇన్నాళ్ళ నిరీక్షణ తీరబోతోంది. ఏడుకొండల వాడి చెంతన మళ్ళీ పూజాధికాలు నిర్వహించాలన్న ఆయన తపన తీరే సందర్భం ఆసన్నమైంది. ఈపాటికే మీకర్థమై వుంటుంది ఈ నాందీ ప్రస్తావన ఎవరికోసమో.. ఎస్.. తిరుమలేశుడు కొలువైన ఆనంద నిలయంలో ఏళ్ళ తరబడి శ్రీవారి కైంకర్యాలకు సారథ్యం వహించిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గురించే ఈ ఉపోద్ఘాతం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మొదలైన చిన్న వివాదం.. చినికి చినికి గాలివానగా మారడంతో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగింపునకు గురైన రమణ దీక్షితులుకు జగన్ హయాంలో న్యాయం జరగబోతోంది. గత అయిదు నెలలుగా వెయింటింగ్‌లో వున్న రమణ దీక్షితులుకు అనుకూల పరిస్థితులు నెలకొనడానికి రంగం రెడీ అయ్యింది. తన పోస్టుకు తాను తిరిగి రావాలన్న ఆయన ఎదురు చూపు ఫలించబోతోంది. ఇందుకు ఇప్పుడు ఒక మార్గం కనపడింది. బుధవారం నాటి టిటిడి బోర్డు మీటింగులో ఆయనకు లైన్‌ క్లియర్‌ కాబోతుందనని తెలుస్తోంది. టీటీడీ ప్రధానార్చక పదవి తొలగించబడ్డ రమణ దీక్షితులు టీటీడీలో రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన రీఎంట్రీకి అడ్డంకులు ఏర్పడ్డాయి. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆయన తిరిగి టీటీడీలోకి రావడం ఖాయమని అనుకున్నారు. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఉత్తర్వులు అడ్డంకులుగా మారాయి. అవి ఇప్పుడు తొలిగిపోయి రమణ దీక్షితులు తిరిగి తిరుమల అడుగు పెడతారని తెలుస్తోంది. గతంలో టీటీడీలో జరిగే పరిణామాలపై ఆరోప‌ణ‌లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు ర‌మ‌ణ దీక్షితులు. పలు వివాదాలను ఆయన రేపడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. ప్రధాన అర్చకుల హోదా నుంచి తొలగించారు. అర్చకులకు వయో పరిమితి విధించిన ఆయన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు జగన్‌ సర్కార్‌ అర్చకుల వంశపారంపర్య హక్కులను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ ధర్మదాయ చట్టం 1987లోని సవరణలు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. వంశపారంపర్య హక్కుల వల్ల అర్చకులకు పదవీ విరమణ ఉండదని తెలిపింది. అయితే ఈ జీవో టీటీడీకి మినహాయింపు ఇచ్చింది. ఈ జీవో సోమవారం విడులైంది. ఇప్పుడు ఈ జీవోను బుధవారం సమావేశమయ్యే టీటీడీ పాలకమండలి కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. పాలకమండలి ఆమోదిస్తే….టీటీడీలో కూడా అర్చకులకు వయోపరిమితి ఉండదు. దీంతో ఏ రూల్‌ ప్రకారమైతే రమణదీక్షితులను పక్కన పెట్టారో…ఆ రూల్‌ ఇప్పుడు లేనట్లే. దీంతో రమణదీక్షితుల రీ ఎంట్రీకి ఖాయమని ప్రచారం నడుస్తోంది.

Related Tags