మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఏపీలో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఇప్పటికీ పదివేల మార్కును చూపిస్తూ విలయతాండవం చేస్తోంది. అనేక మంది సామాన్య ప్రజలు, రాజకీయనేతలు వైరస్ బారిన పడుతున్నారు.

మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కు కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Aug 28, 2020 | 5:17 PM

కరోనా మహమ్మారి ఏపీలో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఇప్పటికీ పదివేల మార్కును చూపిస్తూ విలయతాండవం చేస్తోంది. అనేక మంది సామాన్య ప్రజలు, రాజకీయనేతలు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా దివంగత టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు తనయుడు.. ఏపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. కిడారి శ్రవణ్ తోపాటు కరోనా సోకిన మరోనేత బుద్దా వెంకన్న కూడా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు. కిడారి శ్రవణ్ తండ్రి.. అరకు ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేయడంతో శ్రవణ్ కు టీడీపీ అప్పట్లో మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, ప్రశ్నించే జర్నలిస్ట్ ని పోలీసులు కిడ్నిప్ చేశారంటూ నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న శివ ప్రసాద్ ను ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ పాలసీలను గురించి ప్రశ్నించడమేనా అతను చేసిన తప్పంటూ జగన్ సర్కారుపై లోకేష్ మండిపడ్డారు.