అరెస్టులు చేస్తే.. ధర్నాలు, నిరసనలు చేయండి.. టీడీపీ నేతలతో చంద్రబాబు

AP Ex CM Chandrababu Teleconference with TDP Leaders, అరెస్టులు చేస్తే.. ధర్నాలు, నిరసనలు చేయండి.. టీడీపీ నేతలతో చంద్రబాబు

నేడు టీడీపీ చేపట్టిన “ఛలో ఆత్మకూరు” కార్యక్రమంపై.. మంగళవారం రాత్రి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో 13జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఇవాళ చేపడుతున్న “ఛలో ఆత్మకూరు” కార్యక్రమం గురించి నిశితంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ బాధితులకు అందరూ అండగా ఉండాలని.. దాడులకు గురైన బాధితులకు సంఘీభావం తెలపాలని టీడీపీ కేడర్‌కు సూచించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను అందరూ ఖండించాలని.. దాడులు, దౌర్జన్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు.

ఛలో ఆత్మకూరు కార్యక్రమం.. వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమని.. హౌస్‌ అరెస్ట్‌లు మన పోరాటాన్ని ఆపలేవన్నారు. ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *