ఏపీ డీఎస్సీ రిజల్ట్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలె టీచర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్ లిస్ట్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షను నిర్వహించగా, 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా.. జిల్లాలు సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్ట్ ను రూపొందించామని మంత్రి చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు మే నెల 15వ […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:53 pm, Fri, 15 February 19

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలె టీచర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్ లిస్ట్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షను నిర్వహించగా, 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా.. జిల్లాలు సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్ట్ ను రూపొందించామని మంత్రి చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు మే నెల 15వ తేదీన నియామక పత్రాలు అందజేస్తామని, 10 రోజులు శిక్షణ కూడా అందజేస్తామని మంత్రి గంటా అన్నారు.