సీఎం జగన్‌కి ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కి.. ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖలో పేర్కొంది. విధి నిర్వహణలో చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం...

సీఎం జగన్‌కి ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ..
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 1:00 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కి.. ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖలో పేర్కొంది. విధి నిర్వహణలో చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించ లేదు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా చనిపోయిన డాక్టర్స్‌కి కోట్ల రూపాయల పరిహారం ఒక్కొక్కరికి ప్రకటించాలని డిమాండ్ చేసింది డాక్టర్స్ అసోసియేషన్.

డీఎంఈ పరిధిలో ఉన్న వైద్యులకు గత 15 ఏళ్లుగా పీఆర్సీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖలో వెల్లడించింది. డీఎంహెచ్ పరిధిలోని డాక్టర్ల జీతాలకు, డీఎంఈ పరిధిలో ఉన్న మా జీతాలకు ఎంతో తేడా ఉంది. డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్యుల జీతాలు చూసి కుమిలిపోతున్నామని లేఖలో పేర్కొన్నారు ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

గత కొన్నేళ్లుగా ప్రభుత్వ డాక్టర్లు పదోన్నతులకే నోచుకోలేదని ఆవేదన. కరోనా పేషెంట్‌లకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు ఇతర రాష్ట్రాల్లో అన్ని ఇన్సెంటీవ్‌లు ఇస్తున్నా ఏపీలో మాత్రం ఇవ్వడం లేదని పేర్కొన్న అసోసియేషన్. కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు అన్ని అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు.. సీఎం జగన్‌కు లేఖ రాశారు.

Read More: బాలీవుడ్‌లో కరోనా టెర్రర్.. మరో హీరోయిన్ డ్రైవర్‌కు పాజిటివ్..