సమంతతో ఏపీ డీజీపీ వీడియో కాన్ఫెరెన్స్

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు నెల మొత్తం ఆంధ్రప్రదేశ్ సీఐడీ నిర్వహించిన ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని సాధారణ విద్యార్థినులు..

సమంతతో ఏపీ డీజీపీ వీడియో కాన్ఫెరెన్స్
Follow us

|

Updated on: Sep 01, 2020 | 5:11 PM

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు నెల మొత్తం ఆంధ్రప్రదేశ్ సీఐడీ నిర్వహించిన ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని సాధారణ విద్యార్థినులు, మహిళా సెలబ్రిటీలు అక్కినేని సమంత తదితరులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి ఏపీ డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  మాట్లాడారు. సీఐడీ అధికారులు రాధిక, సరిత నెల రోజులపాటు శ్రమించి పది లక్షల మందికి పైగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారని కితాబిచ్చారు. కరోనా వల్ల ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో పిల్లలు ఫోన్లు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని, దీంతో చిన్నారులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ-రక్షాబంధన్‌ ద్వారా 2.29 లక్షల మంది నుంచి అనుభవాలు, సూచనలు తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ ఏడాది మహిళలపై నేరాల సంఖ్యలో ఎక్కువగా పెళ్లి పేరుతో మోసం సెక్షన్లే ఉన్నాయన్నారు. అన్యాయం జరిగిందని మహిళలు పోలీసుస్టేషన్‌కు వస్తే కచ్చితంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి సమంత అక్కినేని తన అభిప్రాయాల్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సైబర్‌ బుల్లీయింగ్‌(ఆన్ లైన్ బెదిరింపు) బాగా ఎక్కువైందన్నారు. మహిళలు, పిల్లలను ఆన్‌లైన్‌ మోసాల నుంచి రక్షించడం అభినందనీయమన్నారు. ఈ-రక్షా బంధన్‌ కార్యక్రమం మహిళలకు ఒక సోదరుడిలా పనిచేసిందని సామ్ కొనియాడారు.