రామచంద్రపై దాడి కేసు.. చంద్రబాబుకు లేఖ రాసిన ఏపీ డీజీపీ

చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు

  • Manju Sandulo
  • Publish Date - 11:24 am, Tue, 29 September 20

AP DGP Goutam Sawang: చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని అందులో గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ప్రతాప్ రెడ్డికి, పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరగ్గా రామచంద్ర అక్కడకు వెళ్లి ఆ వివాదంలో కలగజేసుకొని గొడవపడ్డారని అన్నారు

ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి, రామచంద్రపై దాడి చేశారని డీజీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించామని ఆయన అన్నారు. అందులో ప్రతాప్ రెడ్డి టీడీపీ కార్యకర్త అని తేలిందని వివరించారు. ఇక ఈ కేసులో వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు. మీ సంతకంతో మీడియాకు లేఖలు ఇచ్చేముందు వాస్తవాలను పరిశీలించాలని, ఏవైనా ఆధారాలుంటే ముందు తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబుకు, డీజీపీ సూచించారు.

Read More:

అంతర్వేది: డిసెంబర్ నాటికి కొత్త రథం పూర్తి

తీవ్ర జ్వరం.. ఎయిమ్స్‌లో చేరిన ఉమా భారతి