ఆలయాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు.. కుల, మతాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్న డీజీపీ..

AP DGP Gautam Sawang: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా...

ఆలయాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు.. కుల, మతాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్న డీజీపీ..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 1:08 PM

AP DGP Goutham Sawang: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై 44 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆయా కేసుల్లో కీలక ఆధారాలను సైతం సేకరించామని చెప్పారు. కొంతమంది కావాలనే ఆలయాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ఫేక్ న్యూస్‌లు కొన్నిసార్లు సమస్యాత్మకంగా మారుతాయన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ.. కొందరు అదే పనిగా ఆరోపణలు గుప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. సుమారు 14 వేల మంది పోలీసులు కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారని.. 109 మంది ప్రాణాలు కోల్పోయారని డీజీపీ అన్నారు. ఇలాంటి ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి 108 జాతీయ అవార్డులను సాధించామని తెలిపారు.

ఇదిలా ఉంటే అంతర్వేది ఘటన తర్వాత నుంచి పోలీసులు భిన్నమైన ఛాలెంజ్‌ను ఎదుర్కున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. క్యాంపెయిన్ తరహాలో అల్లర్లు సృష్టించాలని చూశారు. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కృషి చేశాం. ఇక ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాం. ఇప్పటివరకు 55,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా.. 14,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

కాగా, రామతీర్ధం దేవాలయాన్ని మూడు నెలల క్రితం ఆడిట్ చేశామన్న ఆయన.. ఆ సమయంలో 32 కెమెరాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రామతీర్ధం ప్రధాన ఆలయంలో విగ్రహం ధ్వంసం కాలేదని.. గుట్టపై ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కొంతమంది విగ్రహాల కింద, విగ్రహాల మధ్యలో ఏవో నిధులు ఉంటాయని దాడులకు పాల్పడతారు. కొంతమంది పురాతన విగ్రహాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దేవాలయాల్లో దొంగతనాలు చేసేవారు 1635 మంది ఉన్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఇలాంటి 7 గ్యాంగులను డిటెక్ట్ చేశాం. 180 కేసుల్లో 337 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పోలీసులు ఏం చేయలేదంటున్న వారందరికీ ఇదే సమాధానం అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వమత కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. మత సామరస్యాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!