ఏపీలో కొత్త జిల్లాలు.. డిప్యూటీ సీఎం క్లారిటీ!

అమరావతి: నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటవుతాయని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఉన్న 13 జిల్లాలతో పాటుగా మరో 12 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తానికి ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటవుతాయని అన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా.. ఏపీని […]

ఏపీలో కొత్త జిల్లాలు.. డిప్యూటీ సీఎం క్లారిటీ!
Follow us

|

Updated on: Sep 13, 2019 | 4:28 PM

అమరావతి: నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటవుతాయని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఉన్న 13 జిల్లాలతో పాటుగా మరో 12 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తానికి ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటవుతాయని అన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా.. ఏపీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారా.? అసలు ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారు.? అనే సందేహాలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ డిప్యూటీ  సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. స్థానిక సంస్థ ఎన్నికల అనంతరం ఈ అంశంపై కేబినెట్ అలోచించి.. ఓ నిర్ణయానికి వస్తుందని స్పష్టం చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దాదాపు 25 లక్షల మందికి స్థలాలు గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.